సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 19:39:14

రేపు 'మహాప్రస్థానం' సినిమా టీజర్ విడుదల

రేపు 'మహాప్రస్థానం' సినిమా టీజర్ విడుదల

టాలీవుడ్ యాక్ట‌ర్ తనీష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'మహాప్రస్థానం' . జాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. సెప్టెంబర్ 7న తనీష్  పుట్టినరోజు సందర్భంగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ' మహాప్రస్థానం'  సినిమా టీజర్ విడుద‌ల చేయనున్నారు. ఈ విష‌యాన్ని త‌నీష్ ట్విట‌ర్ ద్వారా తెలిపాడు. ఈ చిత్రంలో ముస్కాన్ సేథీ నాయికగా నటిస్తోంది. మరో కీలక పాత్రలో వరుడు ఫేమ్ భాను శ్రీ మెహ్రా కనిపించనుంది. 

ఈ సందర్భంగా  సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ...మహాప్రస్థానం సినిమా టీజర్ చూశాను చాలా బాగుంది. ఈ సినిమా సింగిల్ షాట్ ప్యాట‌ర్న్ లో రూపొందించారు. మహాప్రస్థానం సినిమాలో రీల్ టైమ్ రియల్ టైమ్ ఒకటిగా ఉంటాయి. ఇది తెలుగులో కొత్త ప్యాట్రన్. ఇలా కొత్త త‌ర‌హా సినిమా చేసిన‌ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను. ఇది మన తెలుగు సినిమా, మనం ప్రోత్సహించాలన్నారు. 

దర్శకుడు జాని మాట్లాడుతూ...మా సినిమా టీజర్ రిలీజ్ చేసిన సాయి ధరమ్ తేజ్ కు ధ‌న్య‌వాదాలు. మహా ప్రస్థానం కొత్త స్టైల్ లో చేసిన సినిమా. ఇండియన్ కమర్షియల్ సినిమాలో ఈ ప్యాట‌ర్న్ లో ఇదే తొలి సినిమా. రీల్ టైమ్ రియల్ టైమ్ ఒకటే కావడం మా సినిమా ప్రత్యేకత. రెండు గంటల్లో జరిగే కథ ఇది. కథ పరంగా నిడివి ఎంతో మనం చూసే సినిమా నిడివి కూడా అంతే ఉంటుంది. సింగిల్ షాట్ ప్యాట‌ర్న్ లో సినిమా తీశాం. దర్శకుడు, క్యారెక్టర్లు, హీరో ఇలా ఎవరి కోణంలో సినిమా సాగదు, కేవలం కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా జరుగుతుంటుంది. కొన్ని సంఘటనల సమాహారాన్ని ఎలాంటి బ్రేకులు, ఫాస్ట్, స్లో మోషన్ లు లేకుండా సింగిల్ స్ట్రీక్ లో ఫిల్మింగ్ చేశాం. ఈ టైప్ లో మహాప్రస్థానం మూవీ తెరకెక్కించేందుకు చాలా కష్టపడ్డాం. 20 రోజుల కాల్షీట్లు కేవలం రిహార్సల్స్ చేసేందుకే పట్టాయి. రోజంతా రిహార్సల్స్ చేయడం రాత్రి షూటింగ్ చేస్తూ వచ్చాం. కెమెరామెన్ ఎంఎన్ బాల్ రెడ్డి చాలా కష్టపడ్డారు. హీరో తనీష్ చాలా స‌హ‌క‌రించారు. ఆయనకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలి. నెల రోజుల ముందే సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి సెట్ లోకి వచ్చారు. ప్రస్తుతం మా సినిమా రీరికార్డింగ్, సీజీ పనులు చివరి దశలో ఉన్నాయి. థియేటర్స్ ఓపెన్ అయ్యేలా ఉంటే థియేటర్ రిలీజ్ లేదా ఆలస్యమైతే ఓటీటీలో మా సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నామ‌న్నారు.

హీరో తనీష్ మాట్లాడుతూ...నేను ఫస్ట్ తేజ్ అన్నకు థాంక్స్ చెప్పాలి. తను బిజీగా ఉన్నా మా సినిమా టీజర్ రిలీజ్ చేసేందుకు ఒప్పుకున్నారు. టీజర్ చూసి బాగుందని ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఇప్పటిదాకా సింగిల్ షాట్ ప్యాట‌ర్న్ లో ఇండియన్ కమర్షియల్ మూవీ రాలేదు. ఇలాంటి సినిమాలో నటించడం గర్వంగా ఉంది. ఈ టైప్ సినిమా చేయడం కష్టం. ఎందుకంటే షాట్ పెట్టాక సీన్ లోని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పర్ఫెక్ట్ గా చేయాలి. లేకుంటే మొత్తం మళ్లీ ఫస్ట్ నుంచి చేయాల్సి వచ్చేది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఫ్యాషన్ తో పనిచేశారు. హీరోలు విలన్లు అనే కాన్సెప్ట్  కంటే, సొసైటీలో జరుగుతున్న బర్నింగ్ పాయింట్ ను ఆధారంగా చేసుకుని కథను కొత్తగా డిజైన్ చేశారు దర్శకుడు జాని. ప్రతి నిమిషం మీరు ఆ సినిమాలో ఉన్నట్లు ఫీలవుతారు. డిఫరెంట్ ఓటీటీల వాళ్లు మాట్లాడుతున్నారు. త్వరలోనే మీ ముందుకు రావాలని కోరుకుంటున్నామ‌న్నారు.

ఈ చిత్రంలో రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మాటలు - వసంత కిరణ్, యానాల శివ, పాటలు - ప్రణవ్, సంగీతం - సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - ఎంఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ - క్రాంతి (ఆర్కే), ఎస్ఎఫ్ఎక్స్ - జి. పురుషోత్తమ్ రాజు, కొరియోగ్రఫీ - కపిల్, ఫైట్స్ - శివ ప్రేమ్, కథా కథనం దర్శకత్వం - జాని


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo