శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 07, 2020 , 14:16:14

ఫొటోతో పుకార్లకు చెక్ పెట్టిన సాయిధ‌ర‌మ్ తేజ్‌

ఫొటోతో పుకార్లకు చెక్ పెట్టిన సాయిధ‌ర‌మ్ తేజ్‌

టాలీవుడ్ న‌టుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ఇటీవ‌లే సోలో బ్ర‌తుకే సో బెట‌రు సినిమా షూటింగ్ పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. అయితే చిత్ర‌యూనిట్ లో కొంత‌మంది క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ కాగా..సాయిధ‌ర‌మ్ తేజ్ స‌హా మిగిలిన టీం స‌భ్యులంతా కొన్ని రోజుల సెల్ప్ ఐసోలేష‌న్ లోకి వెళ్లిపోయారు. ఈ నేప‌థ్యంలో సాయిధ‌ర‌మ్ తేజ్ కు కూడా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే వీట‌న్నింటికి చెక్ పెడుతూ ట్విట‌ర్ లో ఓ ఫొటోను పోస్ట్ చేశాడీ యాక్ట‌ర్. తాజాగా ఈ యువ నటుడు డైరెక్ట‌ర్ దేవాక‌ట్టాతో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

దేవాక‌ట్టాగారితో చేస్తున్న నా 14వ సినిమా కోసం ప్రిప‌రేష‌న్ మొద‌లైంది. దేవాక‌ట్టా ఆఫీసులో ఆయ‌న టేబుల్ ముందు కూర్చొని స్క్రిప్ట్ ప‌నులు చూస్తున్న స్టిల్ ను సాయిధ‌ర‌మ్ పోస్ట్ చేసి..పుకార్ల‌కు చెక్ పెట్టాడు. లాక్ డౌన్ కు ముందు లాంఛ్ అయిన దేవాక‌ట్టా-సాయి ధ‌ర‌మ్ చిత్రం ఈ నెల మూడో వారంలో షూటింగ్ మొద‌లు పెట్ట‌నుంది. జేబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై పొలిటికల్ థ్రిల్ల‌ర్ గా వస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ డైరెక్ట‌ర్. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo