మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 19, 2020 , 19:57:45

ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు..ర‌వితేజ‌నేన‌ట ‌!

ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు..ర‌వితేజ‌నేన‌ట ‌!

మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ మూవీగా నిలిచిన అయ్య‌ప్ప‌న్నుమ్ కొషియుమ్ ప్రాజెక్టును తెలుగులో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-రానా హీరోలుగా క‌నిపించ‌బోతున్నార‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఓ అప్ డేట్ ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ రీమేక్ ప్రాజెక్టులో న‌టించ‌డం లేద‌ట‌. ముందుగా అనుకున్న ప్ర‌కారం ర‌వితేజ‌నే వ‌న్ ఆఫ్ ది హీరోగా క‌నిపించ‌నున్న‌ట్టు టాక్‌. 

ఒరిజిన‌ల్ వెర్ష‌న్ లో బిజూమీన‌న్ పోషించిన పోలీసాఫీర్ పాత్ర‌లో ర‌వితేజ క‌నిపించ‌నున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్‌. మ‌రో హీరోగా రానా క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీ తెలుగు రీమేక్ హ‌క్కుల‌ను సితార ఎంట‌ర్ టైన్ మెంట్ అధినేత సూర్య‌దేవ‌ర నాగ‌వంశి ద‌క్కించుకున్నారు. రీమేక్ న్యూస్ తెర‌పైకి రాగానే తొలుత బాల‌కృష్ణ పేరు వినిపించింది. అయితే మ‌ల్టీస్టారర్ కావ‌డంతో బాల‌కృష్ణ నో చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించి మ‌రిన్ని అప్ డేట్స్ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. 
 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.