ఆదివారం 07 మార్చి 2021
Cinema - Jan 26, 2021 , 17:55:49

రవితేజ హల్వా డాన్స్ అదిరింది..బ‌ర్త్ డే స్పెష‌ల్ వీడియో వైర‌ల్

రవితేజ హల్వా డాన్స్ అదిరింది..బ‌ర్త్ డే స్పెష‌ల్ వీడియో వైర‌ల్

జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో బాగానే హంగామా చేస్తున్నారు అభిమానులు. పైగా ఈ పుట్టిన రోజు మాస్ రాజాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే క్రాక్ సినిమాతో సంక్రాంతికి వచ్చి సంచలనం రేపింది. ఇప్పటికీ ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. 16 రోజులకు 34 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. దాంతో ఈ పుట్టిన రోజుకు చాలా ప్రత్యేకత ఉందంటున్నాడు రవితేజ. అందుకే ఈయన కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు.


53వ ఒడిలోకి అడుగు పెట్టినా కూడా ఇప్పటికీ రవితేజ ఎనర్జీ మాత్రం అలాగే ఉంది. ఈయన జోరుకు అభిమానుల హుషారు తోడైతే రచ్చ మామూలుగా ఉండదు. ఇక చూసేవాళ్లకు కిక్కే కిక్కు. ఇదిలా ఉంటే ఈయన పుట్టిన రోజు నాడే యూ ట్యూబ్ లో ఓ డాన్స్ వీడియో బాగా వైరల్ అవుతుంది. అందులో ఈయన చిందులు చూసి ఫిదా అవుతున్నారు అభిమానులు. రవితేజలో మామూలు ఎనర్జీ లేదుగా అంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. బర్త్ డే స్పెషల్ ఏమో కానీ జిమ్‌లో కూడా డాన్సులు చేస్తూ కనిపించాడు. పైగా చేతిలో హల్వా పెట్టుకుని ఉన్నాడు ఈయన. అది పట్టుకుని తింటూ పిచ్చెక్కించే డాన్సులతో అభిమానులకు అదిరిపోయే కిక్ ఇచ్చాడు రవితేజ.

అంతేకాదు ఈ డాన్సులను చూసి హల్వా డాన్స్ అంటూ పేరు కూడా పెట్టేసారు అభిమానులు. సోషల్ మీడియాలో దీన్ని ట్రెండ్ కూడా చేస్తున్నారు. చేసింది సింపుల్ డాన్సులే అయినా కూడా చాలా స్టైలిష్‌గా చంపేసాడు రవితేజ. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఖిలాడీ సినిమాతో బిజీగా ఉన్నాడు రవితేజ. బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ లోనే సినిమా విడుదల కానుంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

‘క్రాక్’ 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే

'క్రాక్' చూసి ఒంగోలు మెమొరీస్ గుర్తుచేసుకున్న చిరంజీవి

సెట్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్

ర‌వితేజ బ‌ర్త్‌డే .. ఖిలాడి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌

కూలీ నెం 1 సాంగ్ కు శ్ర‌ద్దాదాస్ డ్యాన్స్..వీడియో

పుష్ప స్పెష‌ల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?

శ్ర‌ద్దాదాస్ సొగ‌సు చూడ‌త‌ర‌మా

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo