ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 15:06:14

కేర్‌ఫుల్‌గా రానా అవుట్ డోర్ షూటింగ్

కేర్‌ఫుల్‌గా రానా అవుట్ డోర్ షూటింగ్

టాలీవుడ్ యాక్ట‌ర్ రానా లాక్ డౌన్ త‌ర్వాత ఇటీవ‌లే సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన విష‌యం తెలిసిందే. సుమారు 18నెల‌ల త‌ర్వాత కెమెరా ముందుకొచ్చిన రానా..యాడ్ క‌మ‌ర్షియ‌ల్స్, యూట్యూబ్ వీడియోస్‌, ఓటీటీ ఇంట‌ర్వ్యూల‌తో బిజీగా అయిపోయాడు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ‌గా స్డూడియోస్ లో మాత్ర‌మే షూట్ జ‌రుగుతుంది. కానీ త్వ‌ర‌లోనే విరాట‌ప‌ర్వం సినిమా షూటింగ్ షురూ కావాల్సి ఉంది. అట‌వీ ప్రాంతాల్లో షూటింగ్ జర‌పాల్సి ఉండగా..కోవిడ్ బారిన ప‌డ‌కుండా చిత్ర‌యూనిట్ మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే రానా త‌న‌కున్న ఆరోగ్య స‌మ‌స్య దృష్ట్యా కొన్నాళ్లపాటు చికిత్స తీసుకుని మ‌ళ్లీ కోలుకున్నాడు.

అయితే అవుట్ డోర్ షూటింగ్ స‌మ‌యంలో కోవిడ్ బారిన ప‌డితే హెల్త్ కు రిస్క్ ఉండే ప్ర‌మాద‌ముంది. ఈ నేప‌థ్యంలో షూటింగ్ లొకేషన్ లో బ‌యోబ‌బుల్ ఐసోలేషన్ ను క్రియేట్ చేసేలా ఏర్పాట్లు చేయాల‌ని సురేశ్ బాబు చిత్ర‌నిర్మాత‌ల‌కు సూచించాడ‌ట‌. మొత్తానికి రానా ఎలాంటి రిస్క్ లేకుండా విజ‌య‌వంతంగా షూటింగ్ పూర్తి చేయాల‌ని కోరుకుంటున్నారు ఫ్యాన్ష్‌, ఫాలోవ‌ర్లు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.