మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 21, 2020 , 15:15:06

అర‌ణ్య విడుద‌ల ఎప్పుడో చెప్పిన రానా..వీడియో

అర‌ణ్య విడుద‌ల ఎప్పుడో చెప్పిన రానా..వీడియో

రానా లీడ్ రోల్ లో ప్రభు సాల్మన్ డైరెక్ష‌న్ లో వ‌స్తోన్న చిత్రం అర‌ణ్య .ఈ ప్రాజెక్టు హిందీలో ‘హాథీ మేరా సాథీ’,  తమిళంలో ‘కాదన్’ పేరుతో విడుద‌ల‌వుతోంది. లాక్ డౌన్ ప్ర‌భావంతో విడుద‌లకు నోచుకోని ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా విడుద‌ల తేదీని రానా ట్విట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు. క‌రోనా మ‌హ‌మ్మారిపై మ‌న పోరాటం..మ‌న అడ‌వులు చాలా కాలంగా జ‌రుగుతున్న మాన‌వ విధ్వంసంపై పోరాడుతున్నాయ‌ని తెలియజేస్తుంది. ఇది ఎప్పుడు ఆగుతుంది. అర‌ణ్య సినిమాతో ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిద్దాం అంటూ..అర‌ణ్య 2021 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల‌వుతుంద‌ని ట్వీట్ ద్వారా తెలిపాడు. 

అర‌ణ్య చిత్రంలో రానా  అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకోని వాటితో సావాసం చేసే అడవి తెగకి చెందిన వ్యక్తిగా క‌నిపించ‌నున్నాడు. జోయా హుస్సేన్, శ్రియ పిలగోన్కర్ , విష్ణు విశాల్ ఈ మూవీలో ఇత‌ర  కీల‌క‌పాత్రల్లో నటించారు. మానవుల స్వార్థం కోసం అడవుల ఆక్రమ‌ణ‌, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వ‌ల్ల ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథగా అరణ్య తెరకెక్కింది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.