తెలుగు సినిమాలకు ఇతర భాషల్లో కూడా ఆదరణ పెరుగుతుండటంతో డబ్ చేస్తున్నారు. మార్కెట్ పెరుగుతుండటంతో హీరోలు కూడా తమ రెమ్యునరేషన్ ను పెంచేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ హీరో రామ్ చేరిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాపీస్ ను షేక్ చేశాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఈ మూవీతో రామ్ మార్కెట్ రేంజ్ పెరిగింది.
ప్రస్తుతం రామ్ రెమ్యునరేషన్ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఫిలింనగర్ సర్కిల్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం రూ.10 కోట్లు పారితోషికాన్ని రామ్ డిమాండ్ చేస్తున్నాడట. తెలుగు, తమిళ భాషల్లో విడుదలయ్యే సినిమాలకు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. రామ్ సినిమాలకు యూట్యూబ్ లో మంచి వ్యూస్ వస్తుంటాయి.
రామ్ హిందీ డబ్బింగ్ సినిమాలకు కూడా మంచి స్పందన ఉంటుంది. ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ గా లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం చేస్తున్నాడు రామ్. మరోవైపు ఏఆర్ మురుగదాస్ తో కూడా ఓ చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నట్టు టాక్.
ఇవి కూడా చదవండి..
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!