సోమవారం 25 జనవరి 2021
Cinema - Jan 14, 2021 , 12:35:34

బాలీవుడ్ సినిమాపై రామ్ క్లారిటీ..!

బాలీవుడ్ సినిమాపై రామ్ క్లారిటీ..!

టాలీవుడ్ యాక్ట‌ర్ రామ్ న‌టించిన రెడ్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం త‌ర్వాత బాక్సాపీస్ వ‌ద్ద రామ్‌ మార్కెట్ మ‌రింత పెరిగింది. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న రామ్ పాన్ ఇండియా రేంజ్ కు త‌న మార్కెట్ విస్త‌రించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. అయితే దీనిపై రెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చాడు.

బాలీవుడ్ సినిమా చేస్తున్నారా అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానమిస్తూ..తాను సినిమాల మార్కెట్ ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాన‌ని, అయితే ప్ర‌స్తుతానికి హిందీ సినిమాలు చేసే ఆలోచ‌న లేద‌ని స్ప‌ష్టం చేశాడు. రామ్ చేసిన కామెంట్స్ ఇప్ప‌టికైతే బాలీవుడ్ సినిమా చేయ‌కున్నా...భ‌విష్య‌త్ లో హిందీ సినిమా చేసే అవకాశాలున్నాయ‌ని తెలియ‌జేస్తున్నాయి.

మొత్తానికి ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ అభిమానులు రాబోయే కాలంలో పాన్ ఇండియా స్టార్ గా చూసుకునే అవ‌కాశాలు లేకపోలేద‌ని ప‌లువురు సినీ క్రిటిక్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.కిశోర్ తిరుమ‌ల డైరెక్ష‌న్ లో వ‌చ్చిన రెడ్ చిత్రంలో రామ్ డ్యుయ‌ర్ రోల్ పోషించాడు. మాళ‌విక శ‌ర్మ‌, అమృతా అయ్య‌ర్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా న‌టించారు.

ఇవి కూడా చ‌ద‌వండి

ఆర్ఆర్ఆర్ లో సముద్ర‌ఖనికి ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?

స్ర‌వంతి ర‌వికిశోర్ కు త్రివిక్ర‌మ్ పాదాభివంద‌నం

త్రివిక్ర‌మ్ తో నా సినిమా ప‌క్కా ఉంట‌ది: రామ్

మ‌తి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ..ఫొటోలు వైర‌ల్

‘టైమ్ ’చూసి దిగుతున్నారు

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?

12 కి.మీ సైకిల్ తొక్కిన‌ ర‌కుల్‌..ఎందుకంటే..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo