సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 21:27:31

తొలిసారి యాడ్ లో క‌నిపించిన రామ్‌..వీడియో

తొలిసారి యాడ్ లో క‌నిపించిన రామ్‌..వీడియో

టాలీవుడ్ హీరో రామ్‌ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం సినిమాల‌తోనే ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఈ యాక్ట‌ర్ తొలిసారి ఓ యాడ్ లో న‌టించాడు. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్ర‌హాంతో క‌లిసి ప్ర‌క‌ట‌న‌లో మెరిశాడు. జాన్ అబ్ర‌హాంతో క‌లిసి పుష్ అప్స్ చేస్తూ..మ‌రోవైపు  గార్నియ‌ర్ మ్యాన్ షాంపును ప్ర‌మోట్ చేస్తున్నాడు రామ్‌.

ఇదిగో నా మొట్ట‌మొద‌టి బ్రాండ్ ఎండార్స్ మెంట్‌..గార్నియ‌ర్ మ్యాన్ తో అసోసియేట్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. యాడ్ షూటింగ్, డ‌బ్బింగ్ చాలా వినోదాత్మ‌కంగా, ఫ‌న్నీగా సాగింది. ఈ టీంతో సుదీర్ఘంగా అసోసియేట్ అయ్యేందుకు ఎదురుచూస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు రామ్‌. రామ్ ప్ర‌స్తుతం రెడ్ సినిమాలో న‌టిస్తున్నాడు. మాళ‌వికా శ‌ర్మ‌. అమృతా అయ్య‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo