శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 20, 2020 , 21:25:06

వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా రామ్‌..రూ.25 ల‌క్ష‌లు విరాళం

వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా రామ్‌..రూ.25 ల‌క్ష‌లు విరాళం

న‌గ‌రంలో వ‌ర‌ద‌ల‌తో నిరాశ్ర‌యులైన వారికి అండ‌గా నిలిచేందుకు సినీ ప్ర‌ముఖులు ముందుకొస్తున్నారు.  ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపు మేర‌కు టాలీవుడ్ హీరోలు త‌మ వంతుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాల‌ను అంద‌జేస్తున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, మ‌హేశ్ బాబుతోపాటు ప‌లువురు న‌టులు విరాళాల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా యువ హీరో రామ్ పోతినేని సీఎం స‌హాయ నిధికి రూ.25 ల‌క్ష‌లు విరాళ‌మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి..గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. 

నా తెలంగాణ ప్ర‌జ‌ల ప‌రిస్థితి గురించి ఆందోళ‌న చెందుతున్నా. వ‌ర‌ద‌లు వ‌చ్చిన మొద‌టి రోజు నుంచి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించడం సంతోషకర విష‌యం. వ‌ర‌ద బాధితుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న సేవ‌లు ప్ర‌శంసనీయం. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి నా వంతుగా రూ.25 ల‌క్ష‌లు విరాళంగా అంద‌జేస్తున్నాన‌ని రామ్ ట్వీట్ చేశాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.