శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 18, 2020 , 18:14:42

రాజేంద్ర‌ప్ర‌సాద్ స‌రికొత్త లుక్..మోష‌న్ పోస్ట‌ర్ వీడియో

రాజేంద్ర‌ప్ర‌సాద్ స‌రికొత్త లుక్..మోష‌న్ పోస్ట‌ర్ వీడియో

రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పృథ్విరాజ్‌, శ్రీరెడ్డి, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం క్లైమాక్స్. మ‌ల్టీ జోన‌ర్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ మోష‌న్ పోస్ట‌ర్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. తెల్ల‌ని పొడ‌వాటి గ‌డ్డంతో..నిండైన గోధుమ‌రంగు పైజామాలో చేతులు క‌ట్టుకుని క‌నిపిస్తూ రాజేంద్ర‌ప్ర‌సాద్  స‌రికొత్త లుక్ లో అంద‌రినీ అల‌రిస్తున్నాడు. భ‌వానీ శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని పీ రాజేశ్వ‌ర్ రెడ్డి, కే క‌ర‌ణాక‌ర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్ వివాదాస్ప‌ద పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్‌. బ్యాంకుల‌కు వేల కోట్లు ఎగ‌నామం పెట్టి విదేశాల‌కు పారిపోయిన లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా రోల్ లో న‌ట‌కిరీటి క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది‌. శ్రీరెడ్డి ఈ చిత్రంలో త‌న రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ లో క‌నిపించ‌నుంద‌ట‌. ఈ సినిమాలో గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని విధంగా విభిన్నమైన పాత్ర‌లు  ప్రేక్ష‌కుల‌ను అల‌రించునున్నాయ‌ట‌‌. క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. థియేట‌ర్లు రీఓపెన్ అయిన వెంట‌నే విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo