శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 21:18:28

అమ‌లాపురంలో రాజేంద్ర‌ప్ర‌సాద్ అండ్ టీం..ఫొటోలు వైర‌ల్‌

అమ‌లాపురంలో రాజేంద్ర‌ప్ర‌సాద్ అండ్ టీం..ఫొటోలు వైర‌ల్‌

మేఘాంశ్ శ్రీహ‌రి, శ్యామ్ వేగేశ్న‌, రిద్ది కుమార్, మేఘాచౌద‌రి హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం కోతికొమ్మ‌చ్చి. స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రాజేంద్ర ప్ర‌సాద్, న‌రేశ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం అమ‌లాపురంలో కొన‌సాగుతుంది. అమ‌లాపురంలో కొబ్బ‌రితోట‌ల్లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, న‌రేశ్‌, హీరోహీరోయిన్ల‌పై వ‌చ్చే సన్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. లొకేష‌న్ లో డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న న‌టులు న‌రేశ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ కు స‌న్నివేశాన్ని వివరిస్తుండ‌టం ఫొటోలో చూడొచ్చు.

కోతి కొమ్మ‌చ్చి మూవీ షూట్ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ల‌క్ష్య ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఎంఎల్‌వీ స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.