బుధవారం 25 నవంబర్ 2020
Cinema - Oct 20, 2020 , 18:22:54

సినీ న‌టుడు పృథ్వి కారుకు ప్ర‌మాదం

సినీ న‌టుడు పృథ్వి కారుకు ప్ర‌మాదం

ప్ర‌ముఖ సినీ న‌టుడు, వైఎస్సార్సీపీ నేత పృథ్వి కారుకు ప్ర‌మాదం జ‌రిగింది. బంజారాహిల్స్ లో బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ స‌మీపంలోని వినాయ‌కుడి గుడి ద‌గ్గ‌ర నుంచి పృథ్విరాజ్ కారులో వెళ్తుండ‌గా  ఓ ఇన్నోవా కారు వ‌చ్చి ఢీకొట్టింది. దీంతో పృథ్విరాజ్ కారు దెబ్బ‌తిన్న‌ది.  ఈ విష‌యాన్ని పృథ్విరాజ్ టీం ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్ల‌డించింది. అయితే పృథ్విరాజ్ కు ఏమైనా గాయాల‌య్యాయా..?  లేదా సుర‌క్షితంగానే ఉన్నారా..? అనే విషయాన్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. పృథ్వి వైఎస్సార్సీపీలో కీల‌క నేత‌గా ఉన్న విష‌యం తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.