బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 13, 2020 , 17:04:07

'కంబాల‌ప‌ల్లి క‌థ‌లు' లొకేష‌న్ లో ప్రియ‌ద‌ర్శి..ఫొటో వైర‌ల్

'కంబాల‌ప‌ల్లి క‌థ‌లు' లొకేష‌న్ లో ప్రియ‌ద‌ర్శి..ఫొటో వైర‌ల్

మ‌ల్లేశం సినిమాతో హీరోగా న‌టించి ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర మంచి మార్కులు కొట్టేశాడు ప్రియ‌ద‌ర్శి. త‌న‌దైన కామెడీ ట‌చ్ తో అంద‌రినీ అల‌రించిన ప్రియ‌ద‌ర్శి ఇపుడు కంబాలప‌ల్లి క‌థ‌లు వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. ఉద‌య్ గుర్రాల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రంలో హైబ‌త్ రోల్ లో న‌టిస్తున్నాడు. వ‌రంగ‌ల్ స‌మీపంలోని కంబాల‌ప‌ల్లి అనే కుగ్రామం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ షురూ అయింది.

నేడు కంబాల‌ప‌ల్లి క‌థ‌లు ప్ర‌పంచంలోకి..అంటూ క్లాప్ ను ప‌ట్టుకున్న ఫొటోను ట్విట‌ర్ లో పోస్ట్ చేశాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ డ్రెస్ లుక్ లో ప్రియ‌ద‌ర్శి క‌నిపిస్తున్న స్టిల్ ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo