శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Jul 09, 2020 , 21:28:41

సుస్మిత కొణిదెల వెబ్ సిరీస్ లో ప్రకాశ్ రాజ్..!

సుస్మిత కొణిదెల వెబ్ సిరీస్ లో ప్రకాశ్ రాజ్..!

మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థను బుధవారం లాంఛ్ చేశారు. ఈ సంస్థ నుంచి తొలి ప్రాజెక్టుగా వెబ్ సిరీస్ రానుంది. ఓయ్ సినిమాకు దర్శకత్వం వహించిన ఆనంద్ రంగా ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయనున్నాడు. 2009లో వచ్చిన ఓయ్ చిత్రం తర్వాత ఆనంద్ రంగా మరే చిత్రాన్ని తీయలేదు. ఇక ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.

ఎక్స్ ఛేంజ్ ఆఫ్ ఫైర్ టైటిల్ తో రానున్న   వెబ్ సిరీస్ లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పోలీసాఫీర్ గా లీడ్ రోల్ పోషించనుండగా..మరో నటుడు సంపత్ రాజ్ కీలక పాత్రలో నటించనున్నాడట. యాక్షన్ కాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ జీ5 యాప్ లో ప్రసారం కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 



లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo