శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 02, 2020 , 15:41:35

తుపాకీతో స్టైలిష్ లుక్ లో ప్ర‌భాస్‌..స‌లార్ ఫ‌స్ట్ లుక్

తుపాకీతో స్టైలిష్ లుక్ లో ప్ర‌భాస్‌..స‌లార్ ఫ‌స్ట్ లుక్

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి స‌లార్ టైటిల్ ను ఫిక్స్ చేశాడు డైరెక్ట‌ర్. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. ప్ర‌భాస్ సూప‌ర్బ్ స్లైలిష్ లుక్ లో చేతిలో తుపాకి ప‌ట్టుకుని క‌నిపిస్తున్నాడు. మోస్ట్ వ‌యొలెంట్ లుక్ లో క‌నిపిస్తూ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు బంప‌ర్ గిఫ్ట్ ఇచ్చాడు. హొంబ‌లే ఫిల్మ్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

ఇప్ప‌టికే ఆదిపురుష్, రాధేశ్యామ్ చిత్రాల‌ను ట్రాక్ లో పెట్టిన ప్ర‌భాస్..ఇపుడు స‌లార్ చిత్రాన్ని ఎలా పూర్తి చేస్తాడో చూడాలి. మ‌రోవైపు ఆదిపురుష్ షూటింగ్ కూడా జ‌న‌వ‌రి నుంచే మొద‌లు కానున్న‌ట్టు వార్త‌లు రావ‌డంతో..ప్ర‌భాస్ ఏ ప్రాజెక్టును ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్తాడో చూడాలి.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.