బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 19, 2020 , 17:10:15

రాధేశ్యామ్ కోసం ప్ర‌భాస్ డేరింగ్ డెసిష‌న్..!

రాధేశ్యామ్ కోసం ప్ర‌భాస్ డేరింగ్ డెసిష‌న్..!

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా ప్రాజెక్టు రాధేశ్యామ్‌. రాధాకృష్ణ కుమార్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇట‌లీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రం షూటింగ్‌..లాక్ డౌన్ కార‌ణంగా నిలిచిపోయింది. ప్ర‌భాస్ ఈ చిత్రాన్ని ఇటలీలోనే షూటింగ్ చేసేందుకు రెడీ అయ్యాడని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. తొలుత రామోజీ ఫిలిం సిటీలోని ఇండోర్స్ లో చేయాల‌నుకుంది చిత్ర‌యూనిట్. కానీ నిర్మాత‌ల‌కు ఇది భారంగా మారింది. దీంతో క‌థానుగుణంగా ఇట‌లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూట్ చేయాల‌ని ఫిక్స్ అయ్యాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌భాస్ చాలా డేరింగ్ డెసిష‌న్ తీసుకుంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. 

ప్ర‌భాస్ దీంతోపాటు ఓంరావ‌త్ డైరెక్ష‌న్ లో ఆదిపురుష్ చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నుండ‌గా..సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్ర‌లో క‌నువిందు చేయ‌నున్నారు. సీత పాత్ర‌లో అనుష్క శర్మ న‌టిస్తున్న‌ట్టు టాక్‌. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. మ‌రోవైపు నాగ్ అశ్విన్ తో కూడా ఓ సినిమాకు ప్ర‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo