మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 21, 2020 , 12:45:43

ట్యాక్సీపై ప్ర‌భాస్ స్టైలిష్ లుక్..'రాధేశ్యామ్' కొత్త‌ గిఫ్ట్

ట్యాక్సీపై ప్ర‌భాస్ స్టైలిష్ లుక్..'రాధేశ్యామ్' కొత్త‌ గిఫ్ట్

టాలీవుడ్ స్టార్ హీరో ప్ర‌భాస్ న‌టిస్తోన్న చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ‌కుమార్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. ప్ర‌భాస్ పుట్టిన‌రోజు (అక్టోబ‌ర్ 23) కంటే ముందే అభిమానుల‌కు యూవీ క్రియేష‌న్స్ అద్బుత‌మైన కానుక‌నందించింది. ప్ర‌భాస్ కు అడ్వాన్స్ హ్యాపీ బ‌ర్త్ డే విషెస్ చెప్తూ..రాధేశ్యామ్ నుంచి ప్ర‌భాస్ ' విక్ర‌మాదిత్య'  ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసింది.

ఓల్డ్ రోల్స్ రాయిస్ మోడ‌ల్ కారుపై బ్లాక్ ప్యాంట్‌, బ్లాక్ షూస్ వేసుకుని, బ్లూ షూట్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్. త‌మ ఫేవ‌రేట్ హీరోను ఇలా స్టైలిష్ లుక్ లో చూసిన అభిమానులు సంతోషంలో ఎగిరి గంతేస్తున్నారు. ఇప్ప‌టికే విడుదలైన రాధేశ్యామ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కు అద్బుత‌మైన స్పంద‌న వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.