మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 16:36:41

జార్జియాలో వైభ‌వితో ప్ర‌భాస్ సెల్ఫీ

జార్జియాలో వైభ‌వితో ప్ర‌భాస్ సెల్ఫీ

టాలీవుడ్ యాక్ట‌ర్ ప్ర‌భాస్ రాధేశ్యామ్ చిత్ర‌షూటింగ్ లో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం జార్జియాలోని అంద‌మైన లొకేష‌న్ల‌లో చిత్రీక‌ర‌ణ కొన‌సాగుతుంది. ప్ర‌భాస్, పూజాహెగ్డేపై వచ్చే కీల‌క స‌న్నివేశాల‌ను షూట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే సెట్స్ లో ప్ర‌భాస్ బ‌ర్త్ డే ఫొటోలు వైర‌ల్ గా మారాయి. తాజాగా జార్జియా వీధుల్లో డార్లింగ్ ప్ర‌భాస్ కొరియోగ్రాఫ‌ర్ వైభ‌వి మ‌ర్చంట్ తో సెల్పీ దిగాడు. వైభ‌వి ముందుగా ప్ర‌భాస్ కు బొకే అందించింది. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ తో క‌లిసి సెల్ఫీలు తీసుకుంది.

కారు ముందు వైభ‌వి, ప్ర‌భాస్ దిగిన సెల్ఫీ నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. రాధాకృష్ణ‌కుమార్ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న రాధేశ్యామ్ మోష‌న్ పోస్ట‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్బుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. తెలుగులో అత‌డు, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాల‌కు కొరియోగ్రఫీ చేసిన వైభ‌వి..హిందీలో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కు నృత్య‌రీతులు స‌మ‌కూర్చింది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.