శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 27, 2020 , 21:38:10

జ‌య‌రామ్ తో ప్ర‌భాస్ సెల్ఫీ

జ‌య‌రామ్ తో ప్ర‌భాస్ సెల్ఫీ

టాలీవుడ్ స్టార్ హీరో ప్ర‌భాస్ న‌టిస్తోన్న తాజా ప్రాజెక్టు రాధేశ్యామ్‌. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌భాస్ కు జోడీగా పూజాహెగ్డే న‌టిస్తోంది. ఇటీవ‌లే ఇట‌లీలోరాధేశ్యామ్ షూటింగ్ జ‌రుగుతున్న టైంలో ప్ర‌భాస్ దిగిన సెల్ఫీలు వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే. యంగ్ రెబ‌ల్ స్టార్ ఇపుడు మ‌రోసారి సెల్పీతో అభిమానుల‌ను ప‌లుక‌రించాడు. రాధేశ్యామ్ సెట్స్ లో ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు జ‌య‌రామ్ తో దిగిన సెల్ఫీ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. రాధేశ్యామ్ లో జ‌య‌రామ్ కీ రోల్ పోషిస్తున్నాడు. స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని ఈ ఇద్ద‌రు స్టార్లు దిగిన సెల్ఫీ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

ప్ర‌భాస్ తో క‌లిసి ప‌నిచేయ‌డం సంతోషంగా ఉందంటున్నాడు జ‌య‌రామ్ . పాన్ ఇండియా క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం  తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది.
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.