శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Cinema - Sep 16, 2020 , 15:23:45

స్టైలిష్ గా ప్ర‌భాస్‌..ట్రెండింగ్ లో న్యూ లుక్‌

స్టైలిష్ గా ప్ర‌భాస్‌..ట్రెండింగ్ లో న్యూ లుక్‌

గ‌త రెండు నెల‌లుగా ప్ర‌భాస్ సినిమాల గురించి బౌటౌన్ తోపాటు టాలీవుడ్ లోనూ జోరుగా చ‌ర్చ నడుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టిస్తూ అభిమానుల‌కు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు. రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల‌తోపాటు నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ప్ర‌భాస్ కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్ డేట్స్, కొత్త ఫొటోల‌ను వెతికేప‌నిలో త‌ర‌చూ బిజీగా ఉంటారు ఫ్యాన్స్‌.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ సోష‌ల్ మీడియా పేజీని మెయింటైన్ చేసేందుకు కొత్త టీంను కూడా అపాయింట్ చేశాడ‌ట‌. తాజాగా ప్ర‌భాస్ ట్రెండీ లుక్ లో క‌నిపిస్తున్న ఫొటో ఇపుడు అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. ఛార్మింగ్ లుక్ , బ్లాక్ లెద‌ర్ జెర్కిన్‌, జాగ్వార్ జీన్స్ లో స్లైలిష్ గాగుల్స్ తో దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. సోష‌ల్ మీడియాలో ఈ ఫొటో ట్రెండింగ్ లో కొన‌సాగుతుంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo