బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు టాలీవుడ్ యాక్టర్ ప్రభాస్. పాన్ ఇండియా మార్కెట్లో ప్రభాస్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.
ప్రస్తుతం పాన్ ఇండియా స్టోరీతో సినిమాలు చేస్తున్నాడు. తన ఇమేజ్ కు తగ్గట్టుగా రేంజ్ పెంచేసుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్.
ప్రభాస్ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. రూ.6 కోట్లు విలువైన లాంబోర్గినీ అవెంటడార్ రోడ్‌స్టెర్ ను కొనుగోలు చేశాడు ప్రభాస్.
ఇండియన్ సెలబ్రిటీల్లో ఎక్కువ మంది ఎంపిక చేసుకునే లిస్ట్‌లో ఉంటుంది లాంబోర్గిని. ఆరెంజ్ కలర్ లో ఉన్న లాంబోర్గినికి స్పోర్ట్స్ కారు ఫీచర్స్ ఉండటం విశేషం.
ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ కారు ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.