ఆదివారం 24 జనవరి 2021
Cinema - Nov 25, 2020 , 15:01:12

ప‌వ‌న్ కు త్రివిక్ర‌మ్ అవ‌స‌రం లేద‌ట‌..!

ప‌వ‌న్ కు త్రివిక్ర‌మ్ అవ‌స‌రం లేద‌ట‌..!

టాలీవుడ్ యాక్ట‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నవిష‌యం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివ‌రాల‌పై ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ రీమేక్ ను తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తోంది. మాట‌ల మాంత్రికుడు అని పిలుచుకునే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ను ఈ ప్రాజెక్టుకు ప‌నిచేయిస్తే బాగుంటుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

రీమేక్ స్టోరీలో కొన్ని మార్పులు, డైలాగ్స్ ను త్రివిక్ర‌మ్ రాయించాల‌ని అంతా అనుకుంటున్న‌ట్టు టాక్ న‌డిచింది. అయితే ఇప్ప‌టికే ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ను చూసిన ప్రేక్ష‌కులు మాత్రం తెలుగు రీమేక్ కోసం పెద్ద‌గా మార్పులేమి అవ‌సరం లేద‌నుకుంటున్నార‌ని చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌ధానంగా క‌థ‌, క‌థ‌నం, పాత్ర‌ల ఆధారంగా న‌డిచే ఈ సినిమాకు కొత్త‌గా సంభాష‌ణలు రాయాల్సిన అవ‌స‌రం లేద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట‌.

ఒక‌వేళ త్రివిక్ర‌మ్ ను ట్రాక్ పైకి తీసుకొస్తే రీమేక్ వెర్ష‌న్ పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డ‌టం ఖాయ‌మని ప‌వ‌న్ అభిమానులు అనుకుంటున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్‌. త్రివిక్ర‌మ్ లేకుంటేనే ఒరిజిన‌ల్ ఫీల్ ఉంటుంద‌ని అంతా అనుకుంటుండ‌గా..మ‌రి రీమేక్ ప్రాజెక్టులో ఎవరెవ‌రు క‌లిసి ప‌నిచేస్తార‌నేది మ‌రికొన్ని రోజులు ఆగితే తెలియాల్సి ఉంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo