శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 02, 2020 , 14:35:12

పిల్లల‌తో ప‌వ‌న్ అంద‌మైన ఫొటో..షేర్ చేసిన రేణూ

పిల్లల‌తో ప‌వ‌న్ అంద‌మైన ఫొటో..షేర్ చేసిన రేణూ

సినిమాలు, పాలిటిక్స్ తో బిజీబిజీగా ఉండే టాలీవుడ్ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ టైం దొరికితే ఫ్యామిలీతో గ‌డిపేందుకు ఇష్ట‌ప‌డుతుంటాడు. అందుకు ఈ ఫొటోనే నిద‌ర్శ‌నం. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూతురు ఆధ్య‌, కొడుకు అకిరా నంద‌న్ తో స‌ర‌దాగా హ‌మ్ చేస్తూ క‌లిసి దిగిన ఫొటోను రేణూదేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నా ఫోన్ కెమెరాతో తీసిన అరుదైన క్ష‌ణాల‌కు సంబంధించిన ఫొటో. వారు మీ ఫోన్ ఫొటో ఆల్బ‌మ్ లో ఉండని అంద‌మైన స్టిల్స్ ను మీతో పంచుకుంటున్నా..అని రేణూ దేశాయ్ క్యాప్ష‌న్ ఇచ్చింది. అయితే రేణూ ఈ ఫొటోకు కామెంట్ సెక్ష‌న్ ను కనిపించ‌కుండా (డిసేబుల్‌) చేయ‌డం విశేషం.

ప‌వ‌న్ త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఉన్న అరుదైన ఫొటో ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆద్య పేరుతో తెర‌కెక్క‌నున్న పాన్ ఇండియా సినిమాతో రేణూ దేశాయ్ రీఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.