మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 16, 2020 , 16:41:18

దిల్ రాజుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ సూచ‌న‌..!

దిల్ రాజుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ సూచ‌న‌..!

టాలీవుడ్ న‌టుడు ప‌వ‌న్ కల్యాణ్ వ‌రుసగా సినిమాల‌కు గ్నీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వ‌కీల్ సాబ్ లో నటిస్తోన్న ప‌వ‌న్‌..క్రిష్, హ‌రీష్ శంక‌ర్ తో సినిమాల‌కు ఓకే చెప్పాడు. మ‌రో రెండు చిత్రాలు కూడా ట్రాక్ పై ఉన్నాయి. అయితే గ‌తంతో పోలిస్తే ప‌వ‌న్ సినిమాల్లో వేగం త‌గ్గింది. దీంతో సినిమా అప్ డేట్స్ లేక‌పోవ‌డంతో నిరాశ‌కు లోన‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్మాత దిల్ రాజుకు ఓ సూచ‌న చేశాడ‌ట‌.

అభిమానుల కోసం వ‌కీల్ సాబ్ ప్రమోష‌నల్ కంటెంట్ ను వీలైనంత త్వ‌ర‌గా విడుద‌ల చేయాల‌ని దిల్ రాజుకు చెప్పిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. తాజా వార్త‌తో ఇక వ‌కీల్ సాబ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ పోస్ట‌ర్లతోపాటు టీజ‌ర్ కూడా వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌న్న‌మాట‌. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పింక్ రీమేక్ గా వ‌స్తోన్న ఈ మూవీలో నివేదా థామ‌స్, అంజ‌లి, అన‌సూయ‌, సుబ్బ‌రాజు, న‌రేశ్‌, ప్ర‌కాశ్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా..శృతిహాస‌న్ గెస్ట్ రోల్ లో మెరువ‌నుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo