బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Sep 15, 2020 , 19:22:55

ఎన్టీఆర్ పాట‌కు జ‌ప‌నీస్ క‌పుల్ డ్యాన్స్ అదిరింది

ఎన్టీఆర్ పాట‌కు జ‌ప‌నీస్ క‌పుల్ డ్యాన్స్ అదిరింది

టాలీవుడ్ యాక్ట‌ర్ ఎన్టీఆర్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెష‌ల్ చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎన్టీఆర్ సినిమా వ‌చ్చిందంటే బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కుర‌వాల్సిందే. అయితే తార‌క్ త‌న మేకోవ‌ర్ ను మార్చుకుని రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం కంత్రి. ఈ సినిమా ఆశించిన స‌క్సెస్ అందుకోలేక‌పోయినా..న‌ట‌న‌, డ్యాన్స్ ప‌రంగా తార‌క్ కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఈ సినిమాలోని ఓ పాట‌ను ఇపుడు జ‌పనీయులు తెగ ఎంజాయ్‌చేస్తున్నారు. ఎంత‌లా అంటే ఏకంగా ఆ పాట‌ను అనుక‌రిస్తూ..ఎన్టీఆర్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఫాలో అవుతూ అచ్చు అలాగే డ్యాన్స్ చేసి అద‌ర‌హో అనిపిస్తున్నారు.

జ‌పాన్‌లో ఇద్ద‌రు భార్యాభ‌ర్త‌లు కంత్రి సినిమాలో ఎన్టీఆర్, హ‌న్సికా క‌లిసి స్టెప్పులేసిన వ‌య‌స్సునామి సాంగ్ త‌మదైన స్టైల్ లో డ్యాన్స్ చేసి అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. కళ‌కు భాష‌తో సంబంధం లేద‌ని మ‌రోసారి నిరూపించారీ జ‌ప‌నీస్ క‌పుల్‌.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo