ఆదివారం 24 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 15:57:58

ఎయిర్ పోర్టులో తార‌క్ స్టైలిష్ లుక్‌..ఫొటోలు వైర‌ల్

ఎయిర్ పోర్టులో తార‌క్ స్టైలిష్ లుక్‌..ఫొటోలు వైర‌ల్

లాక్ డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత సినీ తార‌లు ఒక్కొక్క‌రిగా త‌మ‌కిష్ట‌మైన ప్ర‌దేశాల‌కు వెళ్తున్న విష‌యం తెలిసిందే. విదేశాలకు వెళ్ల‌డంపై ఆంక్ష‌లు కొన్నింటిని ఎత్తివేయ‌డంతో టాలీవుడ్ తార‌లు టూర్ కు వెళ్తున్నారు. ఇటీవ‌లే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ దుబాయ్ కు ఫ్యామిలీ టూర్ వేశాడు. దుబాయ్ లో టూర్ ముగించుకుని న‌గ‌రానికి తిరిగి చేరుకున్న తార‌క్ హైద‌రాబాద్ ఎయిర్ పోర్టులో క‌నిపించాడు. దీంతో అక్కడే ఉన్న కెమెరామెన్లు తార‌క్ ను కెమెరాల్లో బంధించారు. జీన్స్‌, ఫుల్‌స్లీవుడ్ టీష‌ర్టులో ఉన్న ఎన్టీఆర్ ఫేస్ మాస్కు పెట్టుకుని, ఓ చేత్తో బ్యాగ్, మ‌రో చేతిలో సెల్ ఫోన్ ప‌ట్టుకుని ఫిట్, స్టైలిష్ లుక్ లో న‌డ‌చుకుంటూ వ‌స్తున్న స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఎస్ఎస్ రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ కొన‌సాగుతోంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్త‌వ‌గానే..త్రివిక్ర‌మ్ సినిమా సెట్స్ లో జాయిన్ కానున్నాడు తార‌క్‌.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo