జూనియర్ ఎన్టీఆర్ లైనప్ చూస్తుంటే..

జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోతో సినిమాలు చేయడానికి దర్శకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఎందుకంటే ఆయన హీరో కంటే కూడా నటుడు. ఎలాంటి పాత్ర ఇచ్చినా కూడా రప్ఫాడించే అద్భుతమైన నటుడు. అందుకే ఈయనతో సినిమా అంటే ఎగిరి గంతేస్తుంటారు మన దర్శక నిర్మాతలు. ఇప్పుడు కూడా ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 2018లో అరవింద సమేత తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు జూనియర్. ఈయన కెరీర్లో తొలిసారి రెండేళ్లు ఖాళీగా వెళ్లిపోయాయి. 2019, 2020 అంతా రాజమౌళికే రాసిచ్చేసాడు తారక్. మధ్యలో కరోనా కూడా వచ్చింది. లేదంటే 2020లోనే సినిమా వచ్చుండేది.
ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ లైనప్ చూస్తుంటే ఇప్పుడు మిగిలిన హీరోలకు పిచ్చెక్కిపోతుంది. వరసగా స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు కమిట్ అవుతూ పిచ్చెక్కిస్తున్నాడు జూనియర్. ప్రస్తుతం రాజమౌళితో ట్రిపుల్ ఆర్ చేస్తున్నాడు జూనియర్. ఈ సినిమా షూటింగ్ జులై లోపు పూర్తి కానుంది. సినిమా అక్టోబర్ 13న దసరా సందర్భంగా విడుదల కానుంది. మరోవైపు ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ లైన్ లోకి రానున్నాడు. ఈ సినిమా కూడా త్వరగానే పూర్తి చేయాలని చూస్తున్నాడు తారక్.
వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా త్రివిక్రమ్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. పూర్తి పొలిటికల్ సెటైరికల్ సినిమాగా రూపొందబోయే ఈ చిత్రానికి అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఓ పాన్ ఇండియన్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు తారక్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతుంది. ప్రశాంత్ నీల్ తర్వాత కొరటాల శివ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇలా ఒకటి రెండు కాదు నాలుగు సినిమాలు.. నలుగురు క్రేజీ డైరెక్టర్స్‌ను లైన్లో ఉంచాడు యంగ్ టైగర్. అందుకే మిగిలిన హీరోలు ఈయన లైనప్ చూసి పిచ్చెక్కిపోతున్నారంతే.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మహిళను కొట్టి ఆమె పిల్లలను నదిలో పడేసిన ప్రియుడు
- బీజేపీకి మంత్రి కేటీఆర్ హెచ్చరిక
- గోల్కొండ కీర్తి కిరీటం..కుతుబ్‌షాహీ టూంబ్స్
- న్యాయవాద దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్
- సీరియస్ దర్శకులంతా ఒకేసారి..
- ఎస్సీ ఉప కులాలకు న్యాయం చేస్తాం : మంత్రి కొప్పుల
- వ్యాట్, సుంకాలెత్తేస్తే పెట్రోల్ చౌక.. కానీ..!!
- ఆ రోల్ చేయాలంటే అందరూ సిగ్గుపడతారు: జాన్వీకపూర్
- దారుణం : అనుమానంతో భార్య, ఇద్దరు కూతుళ్లను కడతేర్చాడు!
- ఇంటి రుణం రూ.75 లక్షల్లోపు 6.7% వడ్డీ.. దాటితే..!!