బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 22:22:19

ఎన్టీఆర్ బ్యాక్ టు వ‌ర్క్‌...స‌రికొత్త లుక్

ఎన్టీఆర్ బ్యాక్ టు వ‌ర్క్‌...స‌రికొత్త లుక్

టాలీవుడ్ యాక్ట‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. క‌రోనా ప్ర‌భావంతో సుమార్ 6 నెల‌ల విరామం త‌ర్వాత ఎన్టీఆర్ మ‌ళ్లీ షూటింగ్ లో పాల్గొన్నాడు. తార‌క్ గ‌తంలో కంటే ఇపుడు స‌రికొత్త లుక్ లో క‌నిపిస్తున్నాడు. అయితే తార‌క్ పాల్గొన్న‌ది సినిమా షూటింగ్ లో కాదు. యాడ్ ఫొటోషూట్ తో కెమెరా ముందుకొచ్చాడు ఎన్టీఆర్. ఫ్రూట్ డ్రింక్ అప్పీ బ్రాండ్ ను ప్ర‌మోట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. తాజా క‌మ‌ర్షియ‌ల్ యాడ్ షూట్‌లో తార‌క్ స‌రికొత్త‌గా స్లైలిష్ లుక్ లో అద‌ర‌గొడుతున్నాడు. 

ఎన్టీఆర్  ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఫిజ్ డ్రింక్ అంటే నాకు చాలా ఇష్టం. మార్కెట్ ప‌ట్ల బ్రాండ్ కున్న విజ‌న్, ప్లాన్స్ గురించి తెలిసిన త‌ర్వాత బ్రాండ్ ప్ర‌మోట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని చెప్పుకొచ్చాడు. అప్పీ ఫిజ్ మార్కెట్ లో 99 శాతం పైగా మార్కెట్ షేర్ తో లీడింగ్ లో ఉంద‌ని చెప్పాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo