శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 27, 2020 , 17:50:22

రంగ్ దే సెట్స్‌లో హ‌నీమూన్ ట్రిప్‌..!

రంగ్ దే సెట్స్‌లో హ‌నీమూన్ ట్రిప్‌..!

టాలీవుడ్ యాక్ట‌ర్ నితిన్-షాలిని ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహ‌బంధంతో ఒక్క‌టైన విష‌యం తెలిసిందే. దుబాయ్‌లోని రిసార్ట్ వెడ్డింగ్ సెలబ్రేష‌న్స్ కు వేదికైంది. ఈ క‌పుల్ ఇపుడు హ‌నీమూన్ ను ఎంజాయ్‌చేస్తున్నారు. ఇంత‌కీ ఈ ఇద్ద‌రు ఎక్క‌డికెళ్లాల‌నే క‌దా..మీ డౌటు. నితిన్ షాలిని హ‌నీమూన్ స్పాట్ దుబాయ్ లోనే ఫిక్స్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం నితిన్-కీర్తిసురేశ్ న‌టిస్తోన్న రంగ్ దే షూటింగ్ దుబాయ్ లో జ‌రుగుతోంది. షూటింగ్ కోసం నితిన్ తోపాటు షాలిని కూడా వెళ్లింది. రంగ్ దే షూట్ అయిపోయాక అక్క‌డే హ‌నీమూన్ ప్లాన్ చేసుకున్నార‌ట‌.

షూటింగ్ విరామ స‌మ‌యంలో ఫేవ‌రె‌ట్ స్పాట్స్ లో చ‌క్క‌ర్లు కొడుతున్నార‌ట నితిన్‌-షాలిని. ఇన్ స్టాగ్రామ్ లో షాలిని దుబాయ్ లొకేష‌న్ కు సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేసుకుంటుంది. ఈ ఫొటోలు ఆన్ లైన్ లో చక్క‌ర్లు కొడుతున్నాయి.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.