గురువారం 04 మార్చి 2021
Cinema - Feb 23, 2021 , 21:50:57

రంగ్‌దే షూటింగ్ ఓవ‌ర్‌..నితిన్ ఫ‌న్ వీడియో

రంగ్‌దే షూటింగ్ ఓవ‌ర్‌..నితిన్ ఫ‌న్ వీడియో

టాలీవుడ్ యాక్ట‌ర్ నితిన్-కీర్తిసురేశ్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. రంగ్‌దే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నితిన్ ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ కీర్తి, వెంకీ, వెన్నెల కిశోర్‌, లెజెండ‌రీ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్ తో క‌లిసి చేసిన ఫ‌న్ వీడియోను ట్విట‌ర్ లో షేర్ చేశాడు. పీడీవీ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు.

దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. మార్చి 26న సినిమా విడుద‌ల కానుంది. నరేష్‌, వినిత్‌, రోహిణి ఇత‌ర‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మ‌రోవైపు నితిన్-చంద్ర‌శేఖ‌ర్ యేలేటి డైరెక్ష‌న్ లో వ‌స్తున్న చెక్ ఫిబ్ర‌వ‌రి 26న థియేటర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo