శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 20:01:26

'తిన్నావా..?' అంటున్న నితిన్‌..స్టిల్ వైర‌ల్

'తిన్నావా..?' అంటున్న నితిన్‌..స్టిల్ వైర‌ల్

టాలీవుడ్ యాక్ట‌ర్ నితిన్ తొలిసారి ప‌లు బ్రాండ్ల‌ను ఎండార్స్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఓ సాఫ్ట్ డ్రింక్ యాడ్ కోసం ‌ఫొటో షూట్ లో పాల్గొన్న ఫొటోలు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొట్టాయి. పాపుల‌ర్ బ్రాండ్ కోసం చేసిన యాడ్ షూట్ లో దిగిన స్టిల్ ను ట్విట‌ర్ లో  పోస్ట్ చేశాడు. రెడ్ ప్యాంట్‌-షూట్‌తో క‌ల‌ర్ ఫుల్ డ్రెస్ లో వైట్ అండ్ వైట్ టీష‌ర్ట్‌, షూట్‌తో బ్రాండెడ్ కారు ముందు స్టైల్ గా నిల‌బ‌డి దిగిన ఫొటో స‌రికొత్త‌గా ఉంది. మ‌రోవైపు బ్యాక్ డ్రాప్ లో కారు స‌హా మిగిలిన భాగ‌మంతా ప‌సుపు అండ్ మిక్స్ డ్ క‌ల‌ర్ లో క‌నిపిస్తుంది.

ఫొటోకు తిన్నావా..? అనే క్యాప్ష‌న్ ఇచ్చి అస‌లు ఆ బ్రాండ్ పేరేంటో తెలుసుకునే ప‌నిని ఫాలోవ‌ర్ల‌కే వ‌దిలేశాడు నితిన్‌. ఇటీవ‌లే ఓ ఇంటివాడైన నితిన్ ప్ర‌స్తుతం వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న రంగ్ దే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ మూవీ ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo