సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 18:50:07

కార్తీకేయ-2 ఆగిపోయిందా?

కార్తీకేయ-2 ఆగిపోయిందా?

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తీకేయ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. సూపర్‌హిట్ మూవీస్‌కు సీక్వెల్స్ తెరకెక్కించడం టాలీవుడ్‌లో  ట్రెండ్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందులోభాగంగానే నిఖిల్-చందు మొండేటి కలయికలో కార్తీకేయ-2 చిత్రీకరణ ప్రారంభించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ షూటింగ్ మళ్లీ తిరిగి ప్రారంభం కాలేదు.

అయితే కరోనా ప్రభావం కారణంగా అధిక బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తే వర్కవుట్ అయ్యే అవకాశం లేకపోవడంతో ఈ సినిమా నిర్మాణాన్ని నిలిపివేశారని సమాచారమ్. అందుకే నిఖిల్ కూడా తన తదుపరి సినిమా 18 పేజీస్ షూటింగ్‌కు సిద్ధమవుతున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo