ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 11, 2020 , 21:07:07

తొలి సినిమా డైరెక్ట‌ర్ తో మ‌రోసారి..!

తొలి సినిమా డైరెక్ట‌ర్ తో మ‌రోసారి..!

బాణం చిత్రంతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టాడు నారా రోహిత్‌. ఆ త‌ర్వాత ఈ యాక్ట‌ర్ న‌టించిన ‌సోలో సినిమా బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకుంది. సినిమా సినిమాకు కొత్త‌ద‌నంతో కూడిన క‌థ‌ల‌ను ఎంచుకునే న‌టుల్లో ముందు వ‌రుస‌లో ఉంటాడు రోహిత్‌. హీరోగా హిట్టు కొట్టిన సినిమాలు త‌క్కువే అయినా న‌టుడిగా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఫాలోవ‌ర్లు సంపాదించుకున్నాడు నారా రోహిత్. 

ఈ హీరో కొత్త సినిమాకు సంబంధించి వార్త ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. బాణం సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన చైత‌న్య దంతులూరితో తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. 1970ల కాలం నాటి పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో ఈ సినిమా తెకర‌కెక్క‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తే స్ప‌ష్ట‌త రానుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo