ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 16:24:09

త‌ల్లి ఆశీస్సులు తీసుకున్న నాని..ఫొటో వైర‌ల్

త‌ల్లి ఆశీస్సులు తీసుకున్న నాని..ఫొటో వైర‌ల్

ప‌క్కింటి కుర్రాడిలా క‌నిపిస్తూ త‌న‌ న‌ట‌న‌తో ల‌క్ష‌లాది ఫాలోవ‌ర్ల‌ను సొంతం చేసుకున్నాడు టాలీవుడ్ యాక్ట‌ర్ నాని. నాని సినిమాల్లోకి వ‌చ్చి ఇపుడు స్టార్ హీరోగా మారాడంటే త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి ప్రోత్సాహం వ‌ల్లేన‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌నపై అమ్మ విజ‌యల‌క్ష్మి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని నాని ప‌లు సంద‌ర్బాల్లో చెప్పుకొకొచ్చాడుని. అక్టోబ‌ర్ 14న విజ‌య‌ల‌క్ష్మి పుట్టిన‌రోజు.  ఈ సంద‌ర్బంగా అమ్మ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసి..ఆశీర్వ‌చ‌నాలు అందుకున్నాడు నాని. అమ్మ పాదాల‌కు మొక్కుతున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో నాని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. హ్యాపీ బర్త్ డే అమ్మ అంటూ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చాడు.

విజ‌య‌ల‌క్ష్మి ఏడాది క్రితం వ‌ర‌కు వైజాగ్ లో ప‌ని చేశారు. కొడుకు ఎంత స్టార్ డ‌మ్ సంపాదించినా..విజ‌య‌ల‌క్ష్మి మాత్రం సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవితాన్ని గ‌డిపేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఆమె ప్ర‌తీ రోజు ఆఫీసుకు ఆర్టీసీ బస్సులో వెళ్లొచ్చేది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo