మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 18:23:31

మ‌ళ్లీ సెట్స్ లోకి ట‌క్ జ‌గ‌దీష్ టీం...వీడియో

మ‌ళ్లీ సెట్స్ లోకి ట‌క్ జ‌గ‌దీష్ టీం...వీడియో

టాలీవుడ్ న‌టుడు నాని హీరోగా న‌టిస్తోన్న చిత్రం ట‌క్ జగ‌దీష్. శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయిన షూటింగ్ ఇటీవ‌లే రీస్టార్ట్ అయింది. లొకేష‌న్ లో జాయిన్ అయిన‌ట్టు నాని ట్విట‌ర్ ద్వారా తెలిపాడు. అయితే ఆ త‌ర్వాత సినిమాటోగ్రాఫ‌ర్ కు క‌రోనా వైర‌స్ సోక‌డంతో షూటింగ్ నిలిచిపోయింది. ట‌క్ జ‌గ‌దీష్ మ‌ళ్లీ షూటింగ్ మొద‌లైంది. ట‌క్ జ‌గ‌దీశ్ షూటింగ్ కోసం నాని అండ్ టీం సెట్స్ లో శానిటైజ్ చేస్తున్న వీడియోను శివ నిర్వాణ ట్విట‌ర్ లో పోస్ట్ చేశాడు. ట‌క్ జ‌గ‌దీష్ సెట్స్ లో 38 వ రోజు అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు. 

ట‌క్ జ‌గ‌దీష్ కోసం నాని, రీతూవ‌ర్మ‌, ఐశ్వ‌ర్య‌రాజేశ్ త్వ‌ర‌లోనే షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. 2021 ఫిబ్ర‌వరి వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు శివనిర్వాణ‌. ముందుగా నిర్ణ‌యించిన ప్రకారం 2020 జులైలో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు కావాల్సింది. కానీ లాక్ డౌన్ ప్ర‌భావంతో షూటింగ్ నిలిచిపోయింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.