మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 17:04:40

నాని నిర్మాత మారడానికి కార‌ణ‌మిదే..!

నాని నిర్మాత మారడానికి కార‌ణ‌మిదే..!

టాలీవుడ్ యాక్టర్ నాని ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంతోపాటు శ్యాం సింగ‌రాయ్ సినిమా చేస్తోన్న విష‌యం తెలిసిందే. శివ నిర్వాణ డైరెక్ష‌న్ లో వ‌స్తోన్న ట‌క్ జ‌గ‌దీష్ షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇక రాహుల్ సంకీర్త్య‌న్ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న శ్యాం సింగ‌రాయ్ ను సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మించేందుకు సిద్ద‌మ‌వ‌గా..చివ‌రి నిమిషంలో ఈ ప్రాజెక్టును తెర‌కెక్కించే నిర్మాత మారాడు. కృష్ణార్జున యుద్దం చిత్రాన్ని నిర్మించిన వెంక‌ట్ బోయనప‌ల్లి ఈ మూవీని నిర్మించ‌నున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది. అయితే నాని చిత్రానికి నిర్మాత మారే ప‌రిస్థితి రావ‌డానికి కార‌ణం బ‌డ్జెట్ విష‌య‌మేన‌ట‌.

కోల్ క‌తా బ్యాక్ డ్రాప్ లో న‌డిచే క‌థ కావ‌డంతో ఈ మూవీకి సుమారు 40 కోట్లు బ‌డ్జెట్ అవ‌స‌ర‌మ‌వ‌గా..సితార ఎంట‌ర్ టైన్ మెంట్ అందుకు సిద్దంగా లేమ‌ని చెప్పార‌ట‌. దీంతో ఈ చిత్ర నిర్మాణ బాధ్య‌త‌ల‌ను వెంక‌ట్ బోయనప‌ల్లి చేతుల్లో పెట్టిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. కోవిడ్ నేప‌థ్యంలో థియేట‌ర్లు ఓపెన్ కాని ప‌రిస్థితుల్లో మ‌రి ఈ సినిమా తీస్తే..ఎలాంటి క‌లెక్ష‌న్లు వ‌స్తాయో వేచి చూడాల్సిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.