మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 08, 2020 , 14:31:19

సినిమా కోసం 'ట‌క్' వేసిన నాని

సినిమా కోసం 'ట‌క్' వేసిన నాని

టాలీవుడ్ యాక్ట‌ర్ నాని హీరోగా న‌టిస్తున్న మూవీ ట‌క్ జగ‌దీష్. నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో సుమారు 7 నెల‌ల బ్రేక్ త‌ర్వాత నిర్మాత‌లు 3 రోజుల క్రితం సినిమా షూటింగ్ ను మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే. తాజాగా నాని ట‌క్ వేసుకుని సెట్స్ లో జాయిన్ అయ్యాడు. టక్ తో జ‌గ‌దీష్ సెట్స్ లో జాయిన్ అయిన స్టిల్ ను నాని ట్విట‌ర్ లో షేర్ చేసుకున్నాడు. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. 

ఈ చిత్రాన్ని సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‌నాని-శివ నిర్వాణ కాంబినేష‌న్ లో వ‌చ్చిన నిన్ను కోరి సినిమా బాక్సాపీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈ క్రేజీ కాంబినేష‌న్ లో  వ‌స్తున్న ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు ఉన్నాయి.  ఈ సినిమాలో రీతూ వ‌ర్మ, ఐశ్వ‌ర్య రాజేశ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ట‌క్ జ‌గ‌దీష్ ఇపుడు మ‌ళ్లీ సెట్స్ పైకి వెళ్లింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo