టాలీవుడ్ స్టార్ నాని తన సినిమాల ప్రమోషన్ ఈవెంట్లో ఎక్కువ హంగామా చేయడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాదాసీదాగా తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటాడు. కానీ ఈ సారి నాని టక్ జగదీష్ కోసం రూటు మార్చాడు. ఈ సారి నాని ప్రచార కార్యక్రమాల్లో భాగంగా టీవీ షోలకు హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు.
ఉగాది సందర్భంగా పలు టీవీ ఛానళ్లు చేస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్స్ కు హాజరవుతున్నాడు. ప్రమోషన్స్ కోసం జబర్దస్త్ టీవీ షోకు కూడా హాజరయ్యాడు. కోరమీసంతో స్టైలిష్ లుక్‌లో ఉన్న నాని జడ్జి ఇంద్రజ, యాంకర్ అనసూయ భరద్వాజ్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్న స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. మరోవైపు ఓ టీవీ ఛానల్లో యాంకర్స్ తో కలిసి స్పెషల్ ప్రోగ్రాంలో పాల్గొన్న మరో ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
నిన్ను కోరి తర్వాత శివ నిర్వాణ-నాని కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఉగాది సందర్భంగా టక్ జగదీష్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 23న సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
ఇవి కూడా చదవండి
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
ఆలోచింపజేస్తున్న ‘రిపబ్లిక్’ టీజర్