ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 16, 2020 , 17:05:27

నాగ‌శౌర్య 'ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 4' షురూ

నాగ‌శౌర్య  'ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 4'  షురూ

టాలీవుడ్ హ్యాండ్స‌మ్ హీరో నాగ‌శౌర్య‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ కాంబినేష‌న్‌లో ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 4గా ఓ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌ను నిర్మించేందుకు ఐరా క్రియేష‌న్స్ స‌న్నాహాలు ప్రారంభించింది. సోష‌ల్ మీడియాలో శుక్ర‌వారం ఈ మూవీ కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి..అధికారికంగా సినిమాను ప్ర‌క‌టించారు. ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. ఆహ్లాద‌క‌ర‌మైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నుందనున్న ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.

నాగ‌శౌర్య సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'ఛ‌లో ' ‌కు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలోని 'చూసీ చూడంగానే..' సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో మ‌న‌కు తెలుసు. ఈ సినిమాకు సంబంధించిన ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి చేయ‌నున్నారు. అనీష్ కృష్ణ‌కు డైరెక్ట‌ర్ గా ఇది మూడో సినిమా.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo