నాగశౌర్య 8 ప్యాక్ లుక్ వెనుక‌ 9 నెల‌ల క‌ష్టం

Sep 24, 2020 , 16:15:40

నాగ‌శౌర్య త‌న కొత్త సినిమా కోసం మేకోవ‌ర్ మార్చుకోవ‌డంపైనే దృష్టి పెట్టాడ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. నాగశౌర్య‌ ఇప్ప‌టికే జిమ్ లో సీరియ‌స్ గా క‌స‌రత్తులు చేసిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. లాక్ డౌన్ స‌మ‌యాన్ని పూర్తిగా త‌న మేకోవ‌ర్ మార్చుకునేందుకు క‌ష్ట‌ప‌డిన ఈ యువ న‌టుడు మొత్తానికి అనుకున్న‌ది సాధించి.. జిమ్ లోని ఛైర్ లో కూర్చొని 8 ప్యాక్ యాబ్స్ లుక్ లో క‌నిపిస్తున్న స్టిల్ నెట్టింట్లో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. సంతోష్ జాగ‌ర్త‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వ‌స్తోన్నకొత్త‌ చిత్రంలో నాగ‌శౌర్య ఆర్చ‌ర్ (విలువిద్య‌) గా క‌నిపించ‌నున్నాడు. 

నాగశౌర్య 8 ప్యాక్ లుక్ లో మారేందుకు సుమారు 9 నెల‌లుగా క‌ష్ట‌ప‌డ్డాడంటే వృత్తిప‌ట్ల అత‌డికున్న కమిట్ మెంట్ తెలిసిపోతుంది. ఓ వైపు వ‌ర్క‌వుట్స్ చేస్తూనే కీటో డైట్ ను ఫాలో అయ్యాడ‌ట‌. ఉప్పు లేకుండా ఉడ‌క‌బెట్టిన కూర‌గాయలు, బ్రాకోలీ (క్యాబేజీ) ని క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డంతోపాటు స‌రైన నిద్ర‌పోవ‌డం వంటి నియ‌మాల‌ను పాటిస్తూ త‌న మేకోవ‌ర్ ను మార్చుకున్నాడు నాగశౌర్య‌. ఈ సినిమాలో చొక్కా లేకుండా తీసిన సీన్ కోసం నాగశౌర్య 5 రోజుల‌పాటు నీరు తాగ‌కుండా ఉండ‌డ‌మే కాకుండా క‌నీసం లాలాజ‌లాన్ని కూడా మింగ‌కుండా ఉన్నాడ‌ట‌.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD