శనివారం 05 డిసెంబర్ 2020
Cinema - Oct 21, 2020 , 19:18:13

నాగార్జున 'వైల్డ్ డాగ్' మ‌నాలి షెడ్యూల్ షురూ

నాగార్జున  'వైల్డ్ డాగ్' మ‌నాలి షెడ్యూల్ షురూ

అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'వైల్డ్ డాగ్‌'. అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ మ‌నాలీలోని సుంద‌రమైన‌ ప్ర‌దేశాల్లో మొద‌లైంది. సుదీర్ఘంగా కొన‌సాగే ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో స‌హా ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు.

య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగార్జున ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని విభిన్న త‌ర‌హా పాత్ర‌ను చేస్తున్నారు. క్రిమిన‌ల్స్‌ను నిర్దాక్షిణంగా డీల్ చేసే విధానం వ‌ల్ల సినిమాలో ఆయ‌న‌ను 'వైల్డ్ డాగ్' అని పిలుస్తుంటారు.

నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో స‌యామీ ఖేర్ క‌నిపించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిర‌ణ్ కుమార్ సంభాష‌ణ‌లు రాశారు. షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఇది మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మాణ‌మ‌వుతోన్న 6వ చిత్రం. 


సాంకేతిక బృందం:

ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: అహిషోర్ సాల్మ‌న్‌

నిర్మాత‌లు:  నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి

స‌హ నిర్మాత‌లు: ఎన్‌.ఎం. పాషా, జ‌గ‌న్మోహ‌న్ వంచా

సినిమాటోగ్ర‌ఫీ:  షానీల్ డియో

యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌:  డేవిడ్ ఇస్మ‌లోన్‌

డైలాగ్స్‌:  కిర‌ణ్ కుమార్‌

ఎడిటింగ్‌:  శ్రావ‌ణ్ క‌టిక‌నేని

ఆర్ట్‌:  ముర‌ళి ఎస్‌.వి.

స్టంట్ కో-ఆర్డినేట‌ర్‌:  జాషువా

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్



లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.