ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 16:10:09

ఎయిర్ పోర్టులో నాగార్జున‌..ఫొటోలు వైర‌ల్

ఎయిర్ పోర్టులో నాగార్జున‌..ఫొటోలు వైర‌ల్

టాలీవుడ్ యాక్ట‌ర్ అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రంలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ను గోవాలో ఫిక్స్ చేశారు. నాగార్జున గోవా వెళ్లి షూటింగ్ పూర్తి చేసుకుని, మ‌ళ్లీ తిరిగి హైద‌రాబాద్ కు వ‌చ్చేశాడు. బ్లూ డెనిమ్ ప్యాంట్, క్యాజువ‌ల్ బ్లూ టీ ష‌ర్ట్  లో గాగుల్స్ పెట్టుకున్న నాగ్ ఎయిర్ పోర్టులో నుంచి బ‌య‌టకు వ‌స్తుండ‌గా అక్క‌డున్న కెమెరాలు క్లిక్ మ‌నిపించాయి.

అయితే ముందుగా అనుకున్న ప్ర‌కారం ఈ షెడ్యూల్ ను థాయ్ లాండ్ లో 20 రోజుల‌పాటు షూట్ చేయాల‌ని ప్లాన్ చేశార‌ట‌.  కానీ క‌రోనా ఎఫెక్ట్ నేప‌థ్యంలో మేక‌ర్స్ షూటింగ్ ను గోవాకు మార్చిన‌ట్టు టాక్‌.  ఇప్ప‌టికే విడుద‌లైన వైల్డ్ డాగ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రంలో నాగ్ ఎన్ఐఏ అధికారి ఏసీపీ విజ‌య్ వ‌ర్మగా కనిపించనున్నాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo