శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 23, 2020 , 18:03:30

3980 మీట‌ర్ల ఎత్తులో నాగార్జున..వీడియో

3980 మీట‌ర్ల ఎత్తులో నాగార్జున..వీడియో

టాలీవుడ్ యాక్ట‌ర్ అక్కినేని నాగార్జున ప్ర‌స్తుతం వైల్డ్ డాగ్ చిత్రంలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ మ‌నాలీలో షురూ అయింది. ప్ర‌స్తుతం నాగార్జున అండ్ టీం హిమాల‌య‌న్ ప్రాంతంలోని రోహ్‌తంగ్ పాస్ లో  వైల్డ్ డాగ్ చిత్రీక‌ర‌ణ కొన‌సాగిస్తోంది. హాయ్.. రోహ్ తంగ్ పాస్ ద‌గ్గ‌ర బ్యూటిఫుల్ మార్నింగ్‌. సముద్ర‌మ‌ట్టానికి 3980 మీట‌ర్ల ఎత్తులో అంటే 13వేల ఫీట్లు. ఇది చాలా డేంజ‌ర‌స్ పాస్‌. న‌వంబ‌ర్ నుంచి మే వ‌ర‌కు దీన్ని మూసివేస్తారు. వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం ఇక్క‌డికొచ్చాం. షూటింగ్ చాలా బాగా జ‌రుగుతుంది.

అంద‌మైన ప‌ర్వ‌తాలు, నీలాకాశం, వాట‌ర్ ఫాల్స్..7 నెల‌ల త‌ర్వాత ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ కు రావ‌డం చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ 21 రోజుల్లో పూర్త‌యిపోతుంది. ఆ త‌ర్వాత వ‌చ్చేస్తాను..ల‌వ్ యూ ఆల్ అన్నాడు నాగార్జున‌. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.