శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 20:04:06

చిరంజీవి పిలుపు.. ప్లాస్మా దానం చేసిన నాగబాబు

చిరంజీవి పిలుపు.. ప్లాస్మా దానం చేసిన నాగబాబు

క‌రోనా బారిన ప‌డి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేసేందుకు ముందుకు రావాలని టాలీవుడ్ న‌టుడు చిరంజీవి ఇప్ప‌టికే విజ్ఞ‌ప్తి చేసిన విష‌యం తెలిసిందే. కోవిడ్‌-19 తో పోరాడి  కోలుకున్న చిరంజీవి సోద‌రుడు నాగ‌బాబు ప్లాస్మా దానం చేశారు. ఈ విష‌యాన్ని చిరంజీవి ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ..నాగ‌బాబుకు అభినంద‌న‌లు తెలిపారు..త‌న ఫాలోవ‌ర్ల‌కు, ప్ర‌జ‌ల‌కు ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. 

 'కోవిడ్ 19తో పోరాడి గెలవడమే కాదు, ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో, సీసీటీలో ప్లాస్మా డోనేట్ చేసిన తమ్ముడు నాగబాబుకి నా అభినందనలు. ఈ సందర్భంగా కోవిడ్ నుంచి కోలుకున్న వారికి మరోమారు నా విన్నపం. మీరు ప్లాస్మా డోనేట్ చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు. దయచేసి ముందుకు రండి ' అంటూ చిరంజీవి త‌న‌ సందేశంలో తెలియ‌జేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.