ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 17:37:36

షాపింగ్ కు వెళ్లిన మ‌హేశ్‌బాబు..స్టిల్ చ‌క్క‌ర్లు

షాపింగ్ కు వెళ్లిన మ‌హేశ్‌బాబు..స్టిల్ చ‌క్క‌ర్లు

టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేశ్ బాబు హీరోగా న‌టిస్తోన్న స‌ర్కారు వారి పాట ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రిలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి మ‌హేశ్ హెయిర్ స్టైల్ పెంచి స‌రికొత్త లుక్ లో మెరుస్తున్నాడు. ఇక మ‌హేశ్ కూతురు సితార రిలేష‌న్‌షిప్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎప్పుడూ స‌మ‌యం దొరికినా ఇద్ద‌రూ క‌లిసి స‌ర‌దాగా ఆట‌లాడుకోవ‌డం, బ‌య‌ట‌కు వెళ్ల‌డం చేస్తుంటారు.

తాజాగా మ‌హేశ్ సితార‌తో క‌లిసి షాపింగ్ కు వెళ్లాడు. బ్లాక్ షార్ట్‌, బ్లూ టీ ష‌ర్టు, ఫేస్ మాస్కు పెట్టుకున్న మ‌హేశ్ సితార‌తో షాపింగ్ బ్యాగ్ ప‌ట్టుకుని వ‌స్తున్న ఫొటో ఇపుడు ఆన్ లైన్ లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇంత‌కీ మ‌హేశ్ షాపింగ్ కు వెళ్లింది ఎక్క‌డో తెలియాల్సి ఉంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.