ఆదివారం 24 జనవరి 2021
Cinema - Nov 25, 2020 , 14:34:22

గౌత‌మ్ లా మ‌హేశ్‌..ఈ ఫొటో చూడండి

గౌత‌మ్ లా మ‌హేశ్‌..ఈ ఫొటో చూడండి

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు నాలుగు ప‌దుల వ‌య‌స్సు దాటినా గ్లామ‌ర్ లోనూ, ఫిజిక్ లోనూ యువ హీరోల‌కు ఏ మాత్రం తీసిపోడ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. తాజాగా ప‌ర‌శురాంతో క‌లిసి తీస్తున్న స‌ర్కారు వారి పాట‌లో మ‌హేశ్ కొత్త లుక్ చూస్తే ఈ విష‌యం తెలిసిపోతుంది. ఈ సినిమా కోసం న్యూ హెయిర్ స్టైల్ లో స‌రికొత్త లుక్ లో యంగ్ లుక్ క‌నిపిస్తున్నాడు. అయితే మంగ‌ళ‌వారం మ‌హేశ్‌బాబు త‌న కూతురు సితార‌తో క‌లిసి షాపింగ్ కు వెళ్లిన ఫొటో వైర‌ల్ గా మారిన విష‌యం తెలిసిందే. ఈ ఫొటోలో మ‌హేశ్ షార్ట్‌, టీష‌ర్ట్‌లో ఫేస్ మాస్కు పెట్టుకుని, సితార చేయి ప‌ట్టుకుని క‌నిపిస్తున్నాడు.

తాజాగా మ‌హేశ్ కొడుకు గౌత‌మ్ జీన్స్, వైట్ టీ ష‌ర్ట్ లో సితార చేయి ప‌ట్టుకుని క‌నిపిస్తున్న స్టిల్ వైర‌ల్ అవుతోంది. ఇక ఈ రెండు ఫొటోల‌ను పోల్చి చూస్తున్నారు నెటిజ‌న్లు. మాస్క్ పెట్టుకుంది మహేశేనా..? లేదంటే గౌత‌మ్ అయి ఉంటాడా అని చ‌ర్చించుకుంటున్నారు. మ‌రోవైపు మ‌హేశ్ గౌత‌మ్ లా క‌నిపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మ‌హేశ్ బాబు త‌న కొడుకు ప‌ర్స‌నాలిటీలో క‌నిపిస్తుండ‌టంతో ఇలా చ‌ర్చించుకుటున్నారు ఫ్యాన్స్. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo