ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 14, 2020 , 18:34:28

మహేష్‌ ఫోటో మారింది !

మహేష్‌ ఫోటో మారింది !

సినీరంగంలో హీరోలు సెంటిమెంట్‌ను ఎక్కువగా నమ్ముతుంటారు. అందులో మహేష్‌బాబు ఒకరు. సాధారణంగా హీరోలు సోషల్‌మీడియాలో డిస్‌ప్లే, ప్రొఫెల్‌పిక్‌ను తరచుగా మారుస్తుంటారు. కానీ మహేష్‌ మాత్రం డిస్‌ప్లే పిక్చర్‌ను సెంటిమెంట్‌గా భావించి గత మూడ్లేండ్లుగా అదే ఫోటోను మెయింటైన్‌ చేస్తున్నాడు. అయితే తాజాగా మహేష్‌బాబు తన ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ డీపీని మార్చేశాడు. ఇటీవల పాల్గొన్న నైక్‌ కంపెనీ షోటోషూట్‌లో పాల్గొన్న పిక్‌ను తన డిస్‌ప్లే పిక్చర్‌గా పెట్టుకున్నాడు. దీంతో పాటు కవర్‌పేజ్‌, హెడర్‌గా కూడా బ్లూ టీషర్ట్‌ వేసుకుని క్లీన్‌ షేవ్‌తో మ్యాన్లీగా కనిపిస్తున్న ఓ ఫోటోను అప్‌డేట్‌ చేశాడు. 

ఇటీవలే ట్విట్టర్‌లో 10 మిలియన్స్‌ ఫాలో అవర్స్‌ను సాధించిన స్టార్‌గా ఘనత సాధించాడు మహేష్‌. త్వరలోనే పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటాడు మహేష్‌.
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo