మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 06, 2020 , 15:01:03

నిర్మాత‌గా మారిన కృష్ణుడు ..!

నిర్మాత‌గా మారిన కృష్ణుడు ..!

హ్యాపీడేస్ సినిమాలో త‌న యాక్టింగ్ తో అంద‌రినీ కిత‌కిత‌లు పెట్టించాడు కృష్ణుడు. ఆ త‌ర్వాత హీరోగా కూడా ప‌లు చిత్రాల్లో న‌టించాడు. వినాయ‌కుడు, విలేజ్ లో వినాయ‌కుడు వంటి సినిమాల్లో హీరోగా ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించాడు. అయితే కొంత‌కాలంగా సినిమాల విష‌యంలో దూరాన్ని మెయింటెయిన్ చేస్తున్నాడు. కొంత కాలం విరామం త‌ర్వాత ఈ న‌టుడు మ‌ళ్లీ లైమ్ లైట్ లో వ‌చ్చాడు. కృష్ణుడు ఈ సారి నిర్మాత‌గా మారేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట‌. కృష్ణుడు త‌న కూతురు పేరు మీద నిత్య క్రియేష‌న్స్ అనే నిర్మాణ సంస్థను లాంఛ్ చేశాడు.

త్వ‌ర‌లోనే యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ తో ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమా అందించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌నే వార్త ఇపుడు ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మై భాయ్ ఫ్రెండ్స్ గ‌ర్ల్ ఫ్రెండ్‌.  కొత్త న‌టీన‌టుల‌తో తీయ‌నున్న ఈ మూవీని జ‌యైరామ్ డైరెక్ట‌ర్ చేయ‌నున్నాడ‌ట‌.  నిర్మాత‌గా మారుతున్న కృష్ణుడికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు సినీ ల‌వ‌ర్స్. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo