శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 19, 2020 , 16:31:54

43 ఏండ్ల స్నేహం..కృష్ణం రాజు ట్వీట్

43 ఏండ్ల స్నేహం..కృష్ణం రాజు ట్వీట్

తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో కృష్ణంరాజు, కృష్ణ‌కు మంచి అనుబంధం ఉంద‌ని ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన మ‌నుషులు చేసిన దొంగ‌లు చిత్రం విజ‌య‌వంతంగా  నేటితో 43 ఏండ్లు పూర్తిచేసుకుంది. ఎం మ‌ల్లికార్జున రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద మంచి హిట్ గా నిలిచింది. ఈ సంద‌ర్బంగా ఆనాటి మ‌ధుర క్ష‌ణాల‌ను గుర్తు చేసుకున్నారు కృష్ణంరాజు. ట్విట‌ర్ లో కృష్ణంరాజు సినిమా పోస్ట‌ర్ ను షేర్ చేశారు. ఈ సినిమా చేయ‌డం ద్వారా తాను సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు త‌న‌ను మ‌రింత ద‌గ్గ‌ర చేసింద‌న్నారు.

43 ఏండ్ల క్రితం ఈ సినిమా వ‌చ్చింది. ఎన్నో గొప్ప‌, మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల‌ను మిగిల్చింది. సూప‌ర్ స్టార్ తో నా అనుబంధాన్ని మ‌రింత బ‌లోపేతం చేసిందని ట్వీట్ లో పేర్కొన్నారు. టాలీవుడ్ లెజెండ్స్ లో ఇద్ద‌రైన కృష్ణ‌, కృష్ణం రాజు ప్ర‌స్తుతం త‌మ కుటుంబాల‌తో ఆహ్లాద‌క‌ర‌మైన జీవితాన్ని గడుపుతున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.